సోషల్ మీడియా కోసమే పిచ్చి చేష్టలు

05-10-2026 | 05:25am

పాక్ స్పిన్నర్‌పై ఆ దేశ మాజీల ఆగ్రహం

నిస్సాన్, అక్టోబర్ 4 : పాకిస్తాన్ స్పిన్నర్ సయీబ్ ఆయూ బ్‌పై(Pakistan Spinner Saeed Ayub) ఆ దేశ మాజీలు, క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారత్‌తో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత ఆయూబ్ అతిగా ప్రవర్తించాడు. బేబీసిట్టింగ్ తరహాలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో అభిషేక్ శర్మ సిక్సర్లతో అతనికి బుద్ది చెప్పా డు.

అయితే సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసమే అతను ఇలాంటి పిచ్చి చే ష్టలు చేస్తున్నాడంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు ఫైర్ అయ్యారు. 15 ఏళ్ల కుర్రాడిని హేళన చేసి నిన్ను నువ్వే దిగజార్చుకున్నావంటూ పాక్ మాజీ ప్లేయర్ కమ్రా న్ అక్మల్ ఆయూబ్‌ను ఏకిపారేశాడు. చాలా మంది పాక్ మాజీలు కూడా అతని ప్రవర్తనను తప్పుపట్టాడు. 

మరిన్ని వార్తలు