‘తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలి’
27-06-2024 01:12 AM
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): నీటిని పొదుపుగా వాడుతూ ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి పేర్కొన్నారు. నీరు, భూ యాజమాన్య శిక్షణ, పరిశోధన సంస్థను ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం హిమాయత్‌సాగర్‌లో సంస్థ డైరెక్టర్ నరేందర్, ఇతర అధికారులతో సమావేశమై పొదుపుగా నీటిని వాడడం కోసం అనుసరించాల్సిన విధానంపై చర్చించారు.






