calender_icon.png 14 November, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత బస్సు పథకానికి నెలకు 250 కోట్లు

29-07-2024 12:57:41 AM

నివేదిక సిద్ధం చేసిన ఏపీలో అధికారులు

నేటి సమీక్షలో నిర్ణయం తీసుకోనున్న సీఎం 

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాం తి): కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో సంస్థపై నెలకు రూ.250 కోట్లు ఆర్థిక భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి అక్క పథకం తీరుతెన్నులను వారు అధ్యయనం చేశారు. సోమవారం సీఎం చంద్రబాబునాయడు ఆర్టీసీ, రవాణశాఖలపై నిర్వహిం చనున్న సమీక్షలో ఈ పథకంపై చర్చ జరగనుంది. ఆర్టీసీలో ప్రతి రోజు సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నా రు.

వీరిలో 40 శాతం మంది అంటే 15 లక్షల వరకు మహిళా ప్రయాణికులు ఉం టున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పల్లెవెలుగు, అల్ట్రా  పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే కాకుండా హైదరాబాద్‌లో తిరి గే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. చెన్నై, కొయంబత్తూర్ నగరాల్లో సిటీ సర్వీసుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ సౌక ర్యాం కల్పించారు. తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నారు. ఆ టికెట్‌పై సున్నా టికెట్ ఉన్నా టిమ్స్‌లో మాత్రం అసలు చార్జీ నమోదు అవుతోంది. ఈ విధంగా మహిళలకు జారీ చేసిన సున్నా టికెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్కించి రీయింబర్స్‌మెంట్ చేసేందుకు ప్రతిపాదిస్తున్నారు.