29-07-2024 12:58:43 AM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారని గుర్తు చేశారు.
పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటి వి ఇస్తున్నారని, ఈ పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయ డం సముచితమన్నారు. మన దేశపు మిస్సుల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారా లు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందన్నారు.