3.5 కోట్ల డిపాజిట్ సొమ్ము స్వాహా
మహబూబాబాద్ జిల్లాలో ఘటన
మహబూబాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): బెట్టింగ్‌లకు అలవాటుపడ్డ ఓ బ్యాంకు మేనేజర్ బ్యాంకులో ఫిక్స్ చేసిన డిపాజిట్ల నుంచి 3.5 కోట్ల రూపాయలను సొంత ఖాతాకు మళ్లించుకుని కటకటాల పాలైన ఉదంతం మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
గురువారం మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి అందించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కురవిలో ఉన్న తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్‌గా కొంతకాలం క్రితం వరకు విధు లు నిర్వహించాడు.
లోకేష్ బెట్టింగ్ యాప్, ఇతర ఆన్‌లైన్ జూదాలకు అలవాటు పడి తన బ్యాంకులో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసిన సంస్థలు, వ్యక్తులకు చెందిన డబ్బును తన ఖాతాలోకి జమచేసుకొని దాంతో బె ట్టింగులకు పాల్పడ్డాడు. ఇలా రూ.౩.౫ కోట్లో ను జల్సాలకు ఖర్చుచేశాడు. మే లో బదిలీపై వెళ్లగా అతనిస్థానంలో మరో బ్యాంకుమేనేజర్ బదిలీపై రావడంతో మోసం బయటప డింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి మే 29న రిమాండ్‌కు తరలించారు. 3.5 కోట్లను బ్యాంకు మూలనిధి నుంచి డిపాజిటర్లకు జమచేశారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తప్పవని రూరల్ సీఐ హెచ్చరించారు.






