5 June, 2026 | 1:13 AM

సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపిన సీఎం

05-06-2026 12:00 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ను  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రభాగాన నిలిపారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.

గురువారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్  మున్సిపల్ పరిధిలోని 2, 3, 4, 5 వ వార్డు ల ప్రజలతో పట్టణంలోని ఆర్యవైశ్య భవన్  లో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి  విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న గత పాలకులు నియోజకవర్గం అభివృద్ధి లో పూర్తిగా వైఫల్యం చెందారని అని ,గత పాలకులు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని దాని పర్యవసానమే ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.

సుల్తానాబాద్ పట్టణంలో 217 ఇందిరమ్మ ఇండ్లను అందించిన ఘనత తమదేనని 80 శాతం ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని అన్నారు,  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో లేని విధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే పెద్దపల్లి జిల్లాలో ప్రజలకు అరుదైన చికిత్సలను అందిస్తూ ఆరు అవార్డులను అందుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, తాసిల్దార్ బషీరొద్దిన్, కమిషనర్ టి. రమేష్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డి ఏ ఓ శ్రీనివాస్, ఏఓ పైడితల్లి,మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ వార్డుల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.