1 August, 2026 | 4:25 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •   జనగామను సందర్శించిన హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా   •  

మల్లయ్యగట్టుపై భక్తజన సందోహం

16-02-2026 12:48 AM

రేవల్లి ఫిబ్రవరి 15: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని శానాయిపల్లి మల్లయ్య గట్టు వద్దకు భక్తులతో కిక్కిరిసిపోయింది. శనివారం తెల్లవారు జాము నుంచే భక్తులు కొండపైకి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉం చుకుని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివనామ స్మరణతో గట్టు మార్మోగిపోయింది. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించగా, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాయి. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకు న్నారు.