16-02-2026 12:50:10 AM
ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వని ఓటర్లు
10 వార్డులలో కాంగ్రెస్ -5, బీఆర్‌ఎస్ -5
కీలకం కానున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఓటు
అలంపూర్, ఫిబ్రవరి 15: అలంపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు.అధికార కాంగ్రెస్ పార్టీకి 5 వార్డుల్లో అభ్యర్థులకు గెలుపు వరించగా.. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు నాలుగు వార్డుల్లో గెలుపొందారు.ఇదివరకే ఒక వార్డు ఏకగ్రీవమైన ది. దీంతో చెరో 5 వార్డుల్లో గెలుపొందారు. కాబట్టి అక్కడ చైర్మన్ ఎంపికకు హంగ్ ఏర్పడింది.
చైర్మన్ ఎంపికలో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అందులో భాగంగా శనివారం ఎమ్మె ల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్, ఎమ్మె ల్యే విజయుడు ఎక్స్ ఆఫీషి యో ఓటు వే సేందుకు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. కాబట్టి ఇక్కడ చైర్మన్ పీఠం కూడా బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే చర్చ పట్టణ ప్రజల్లో జరుగుతుంది. అయితే ఆరవ వార్డు విజేత పిండి జయరాములు పుర చైర్మన్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది.