20 April, 2026 | 9:39 AM

బాసరలో భక్తుల రద్దీ

07-06-2025 12:00 AM

నిర్మల్, జూన్ 6 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర జ్ఞానసరస్వతి దేవాలయంలో శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఈనెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలను అక్షరాభ్యాసం చేసుకున్నందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో తమ పిల్లలను అక్షరాభ్యాసం చేయించుకునేందుకు తరలి రావడంతో ఆల య ప్రాంగణం, పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పండితులు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది.