తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
20-05-2025 07:44 AM
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనం(Srivari sarva darshan) కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. 79,003 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు33,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల వెంకన్న హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) ప్రకటించింది.






