20-05-2025 02:04:25 AM
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): గతంలో ప్రకటించిన బీసీ, రైతు డిక్లరేషన్లనే అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కొత్తగా నల్లమల డిక్లరేషన్ ప్రకటించడమేంటని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. నాగర్‌కర్నూల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసి, సమస్యలు విన్నవించాలనుకున్న చెంచులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య మా అని ప్రశ్నిస్తూ సోమవారం ఎక్స్‌లో పో స్టు పెట్టారు. నల్లమల అడవుల నుంచి వచ్చానని గొప్పలు చెప్పుకునే రేవంత్‌రెడ్డి అడవి బిడ్డల సంక్షేమం పట్ల చూపే ప్రేమ ఇదేనా అంటూ మండిపడ్డారు.
చెంచులను అరెస్టు చేసి సీఎం రేవంత్‌రెడ్డి తన నిరంకుశ నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని విమర్శించారు. తమ సంక్షేమం కోసం ఐటీడీఏ పీవో గా ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలని వారు కోరడం తప్పా అన్నారు. అక్ర మంగా అరెస్టు చేసిన చెంచు ప్రతినిధులు మల్లికార్జున్, పద్మ, గురువయ్యతోపాటు అమ్రాబాద్ పోలీసు స్టేషన్‌లో నిర్బంధించిన చెంచులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చెంచు ఉద్యమ నా యకులను నిర్బంధించి నల్లమల డిక్ల రేషన్ ప్రకటించడమే ప్రజాపాలనా అని ప్రశ్నించారు.
రేవంత్ ప్రసంగంలో ఎప్పటిలాగే తెచ్చి పెట్టుకున్న ఆవేశం తప్పా, కం టెంట్, కాంటెస్ట్ లేని ఎద్దేవా చేశారు. కాం గ్రెస్ అసమర్థ పాలనలో అమలుకాని హామీలను ప్రజలు పదేపదే గుర్తు చేసుకుంటు న్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అతిశయోక్తులు అమాస నాడు పున్నమి వెన్నెల అనగలరని ఎద్దేవా చేశారు.
ఓవైపు నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే, నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దంటున్నారని డైలాగులు పే లుస్తూ కామెడీ చేస్తున్నారని హారీశ్‌రావు అన్నారు. దేశాలు తిరిగి తెచ్చామని ప్రచారం చేసుకుంటున్న పెట్టుబడుల వ్యవహారం సచ్చిపోయిన బర్రె పగిలి పోయిన కుండెడు పాలు ఇచ్చిందన్న చందంగా ఉన్నదన్నారు. ఆరు గ్యారెంటీల ఊసెత్తడమే మానేశారని, ఇంతకన్నా మోసం ఇంకేం ఉంటుందన్నారు.