20-05-2025 07:52:21 AM
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా(Vikarabad District) పరిగి మండలంలోని రంగా పూర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. పరిగిలో వివాహ కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రంగారెడ్డి(Ranga Reddy district) జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.