19 June, 2026 | 2:29 AM

యాదాద్రిలో భక్తుల రద్దీ

21-10-2024 01:34 AM

యాదాద్రిభువనగిరి, విజయక్రాంతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవుల కారణంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి రావడంతో కొండపై భక్తుల రద్దీ నెలకొంది. క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మద్రర్శనానికి దాదాపు 3గంటల సమయం పట్టింది.  భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.