19 June, 2026 | 3:30 AM

ప్రజల పట్ల అధికారులు జవాబుదారీగా ఉండాలి

19-06-2026 02:27 AM

పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ

కూకట్ పల్లి, జూన్ 18 (విజయక్రాంతి): ప్రజల పట్ల అధికారులు జవాబుదారీగా ఉండి ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించే దిశగా కృషి చేయాలని పిఎసి చైర్మన్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలు, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ గురువారం మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్,జలమండలి అధికారులతో కలిసి చేపట్టవలసిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పట్ల అధికారులు జవాబుదారీగా ఉండి వారి నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీవాసుల నుండి వచ్చిన వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకొని అత్యవసర పనులపై తక్షణమే స్పందించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.

వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని నీటి సరఫరాలో అంతరాయం లేకుండా, కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలన్నారు. అభివృద్ధిలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతులు కల్పనకై ప్రతిపాదనలు తీసుకోవడం జరిగినదని త్వరితగతిన పనులను చేపట్టాలని, అత్యవసర పనులను గుర్తించి మొదటి ప్రాధాన్యతగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోరావాలని సూచించారు.

డ్రైనేజీ వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్రైనేజ్ పొంగిపొర్లకుండ చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, అవసరం ఉన్నచోట పైపులు మార్చి డ్రైనేజీ వ్యవస్థ సవ్యంగా ఉండేలా చూడాలన్నారు. పెండిం గ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరం ఉన్నచోట కొత్త ప్రతిపాదనలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని  అధికారులు సమన్వయంతో పనిచేసి విధులలో అలసత్వం వహించకుండా ప్రజలకు జవాబు దారీగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడి సంతోష్ రెడ్డి, డైరెక్టర్ నారాయణ,జి ఎం కృష్ణ, జి ఎం హరిశంకర్, డీజీఎంలు శ్రీమన్నారాయణ,శ్రీనివాసరాజు, నరేందర్, శ్రీహరి మేనేజర్లు సందీప్, విక్రమ్ రెడ్డి, సలోమి,ప్రియాంక, అనిల్ తదితరులు పాల్గొన్నారు.