19 June, 2026 | 3:19 AM

ఈఎస్‌ఐ డైరెక్టరేట్ ముట్టడి

19-06-2026 02:25 AM

వైద్య ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయిన 2,032 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టింగ్‌లు ఇవ్వాలి

హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖలో సెలెక్ట్ అయిన 2032 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను వెంటనే ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో సెలెక్ట్ అయిన నర్సింగ్ ఆఫీసర్స్కు వెంటనే పో స్టింగ్స్ ఇవ్వాలని వందలాది మంది అభ్యర్థులు గురువారం సికింద్రాబాద్ లోని ఈఎస్‌ఐ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య హాజ రై మాట్లాడుతూ  వైద్య ఆరోగ్యశాఖలో సెలె క్ట్ అయిన ఇతర శాఖలకు ప్రైమరీ హెల్త్ సెం టర్లకు హాస్పిటల్స్ కు నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్లు ఇచ్చారని, కానీ సెలెక్ట్ అయిన వారిలో ఈఎసీఐ హాస్పిటల్స్ కేటాయించిన 300 మందికి జాప్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీరికి కూడా వెంటనే పోస్టిం గ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  జాప్యం జరగడం సెలెక్ట్ అయిన వారికి అన్యాయం జరుగుతుందన్నారు.

వైద్య ఆరోగ్యశాఖలో సెలెక్టయ్యామనే దీమతో ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసే నర్సింగ్ ఆఫీసర్స్ అక్కడ ఉద్యోగాలు కోల్పోయారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటివరకు అన్ని కేటగిరీలలో కలిపి డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నిషన్స్ వర్షి తదితర పోస్టులు అన్నీ కలిపి 13వేల పైగా భర్తీ చేశాడు. ఇదే విధంగా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 30వేల టీచర్ పోస్టులు, పోలీసులకు ఖాళీగా ఉన్న10 వేల ఎస్త్స్ర,  కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. ముట్టడి అనం తరం అధికారులతో చర్చలు జరపగా అధికారాలు వారం రోజులలో పోస్టింగ్స్ ఇస్తామ ని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.