17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

28-04-2025 08:35 AM

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. తిరుమలతో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి(srivari sarva darshan) 6 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. 78,177 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 23,694 మంది భక్తులు తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.

వేసవి సెలవుల దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే1 నుంచి జులై 15 వరకు సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే మే 1 నుంచి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. స్వయంగా వచ్చే ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు కానుంది. జూలై 15 వరకు పరిశీలనాత్మకంగా అమలు చేయనున్నారు.