4 July, 2026 | 11:38 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తాం

28-04-2025 01:45 AM
  1. శాంతిభద్రతల అంశంగా మా ప్రభుత్వం పరిగణించదు
  2. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్, ఏప్రిల్27(విజయ క్రాంతి): నక్సలిజాన్ని తమ ప్రభు త్వం సామాజికకోణంలో మాత్రమే చూస్తుందే తప్ప, శాంతిభద్రతల అం శంగా పరిగణించదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్రం శాంతిచర్చ లు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేసిన వారిలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందన్నారు. ఈ అంశంపై సీనియర్‌నేత జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. మంత్రులతో చర్చించి, ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు.