14 July, 2026 | 3:07 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

కిక్కిరిసిన రోడ్లు.. ఖాళీ లేని బస్సులు

04-11-2024 01:46 AM
  1. పండుగ ముగియడంతో జనం నగర బాట 
  2. సరిపడా బస్సులు లేక ఆగం
  3. టోల్‌గేట్ల వద్ద వాహనాల బారులు 

హైదరాబాద్, నవంబర్ ౩ (విజయక్రాంతి) : దీపావళి పండుగ ముగియడంతో పల్లె జనం పట్నం బాట పట్టారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని రహదారులు కిక్కిరిసి కనిపించాయి. అటు ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు అపసోపాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో బస్సు టాప్‌పైకి ఎక్కి ప్రయాణించారు. ఆంధ్రా వైపు నుంచి వచ్చే వాహనాలతో విజయవాడ  జాతీయ రహదారి రద్దీగా మారింది. ఆ మార్గంలోని అన్ని టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులుతీరి కనిపించాయి.