శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో కిరీట సమర్పణ మహోత్సవం
శేరిలింగంపల్లి, జూన్ 30 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి తండా శ్రీ శ్రీ శ్రీ విరాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం భక్తి-శ్రద్ధలతో కిరీట సమర్పణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు శంకరి లక్ష్మి, శంకరి అనంతయ్య దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పవిత్ర కిరీటాన్ని సమర్పించారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేదమంత్రో చ్ఛారణల నడుమ కిరీట సమర్పణ వేడుకను పూర్తి చేశారు.
ఆలయానికి చేస్తున్న సేవలను గుర్తిస్తూ దేవస్థాన కమిటీ సభ్యులు శంకరి లక్ష్మి అనంతయ్య దంపతులను శాలువాలతో సన్మానించి,స్వామివారి ప్రసాదం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గొపనపల్లి తండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు, శంకరి లక్ష్మిఅనంతయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






