కాంగ్రెస్ పార్టీ జెండాకు సెల్యూట్ చేసిన ఎస్‌ఐ..
గాంధారి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన..
గాంధారి, జూన్ 30 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో సోమవారం నాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంబించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పార్టీ జెండాకు సెల్యూట్ చేయగా, స్థానిక ఎస్‌ఐ మహేందర్ కూడా కాంగ్రెస్ పార్టీ జెండాకు సెల్యూట్ చేయడం ఇక్కడ కొసమెరుపు. పార్టీల జెండాలకు నాయకులు, కార్యకర్తలు సెల్యూట్ చేయడం మామూలే అయినా ఒక ప్రభుత్వ ఉద్యోగి అందులో శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీస్ అధికారి పార్టీ జెండాకు సెల్యూట్ చేయడం ఏంటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు..






