28 March, 2026 | 12:05 PM

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్ ఎచీవర్ హోదా నిలుపుకోవాలి

04-05-2024 01:27 AM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

హైదరాబాద్, మే 3 ( విజయక్రాంతి): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం గతంలో సాధించిన విజయా న్ని పునరావృతం చేసి ఈ సంవత్సరం టాప్ ఎచీవర్ హోదాను నిలుపు కొనేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెన్ (ఈవోడీబీ) పరిధిలోని వివిధ శాఖలు చేపట్టిన పలు సంస్కరణలపై ఆమె సచివాలయంలో సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జులై ఆఖరులోగా ఈవోడీబీ కింద చేసుకున్న అన్ని సంస్కరణలను పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని జీవోలు, నోటిఫికేషన్‌లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌కు సంబంధించిన సంస్కరణల అమలుకు అనుగు ణంగా చేపట్టాల్సిన చట్ట సవరణల కోసం అవసరమై సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంస్కరణల గురించి శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సంవత్సరం మొత్తం 287 సంస్కరణలు చేపట్టాల్సి ఉండగా వాటిలో 39 కొత్త సంస్కరణలు ఉన్నాయని పేర్కొన్నారు. 60 సంస్కరణలను సవరించగా మిగిలిన 188 కొనసాగుతున్నాయని తెలిపారు. ఆన్ లైన్ వ్యవస్థను వేగవంతం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, అటవీ పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్ర సాద్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, మున్పిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్, అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి, పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రవాణాశాఖ కమిషనర్ బుద్దప్రసాద్‌జ్యోతి, పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.