28 March, 2026 | 11:41 AM

యువకుడి దారుణ హత్య

28-03-2026 09:55 AM

అక్రమ సంబంధమే కారణం...? 

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి దాటాక జరిగిన ఓ యువకుని దారుణ హత్య ఘటన కలకలం రేపింది. శాంతి నగర్ లో మహమ్మద్ అర్బాజ్ అనే యువకుడిని ఓ వ్యక్తి కర్రతో తలపై బాది హత్య చేశాడు. రక్తపు మడుగులో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఐ సునీల్ కుమార్, ఎస్సై అశోక్ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి, మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వెల్లడించారు.