28 March, 2026 | 10:12 AM

దివ్యాంగులకు ఇంటివద్దనే ఓటింగ్

04-05-2024 01:29 AM

చొప్పదండి, మే 3: వయోవృద్ధులు, దివ్యాంగులైన ఓటర్లకు ఇంటివద్దనే ఓటేసేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. రామడుగు మండలంలోని పలు గ్రామాల్లో పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్న వయోవృద్ధులు, దివ్యాంగులైన ఓటర్లను 20 మందిని గుర్తించి, వారికి ఇంటివద్దనే ఓటుహక్కు కల్పించారు. శుక్రవారం ఓటర్ల ఇంటికి వెళ్లి వారిచేత ఓటు వేయించినట్టు పోలింగ్ అధికారి రమేశ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పించినందుకు సంబురపడుతున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ మే 8 వరకు నిర్వహించనున్నారు.  హోమ్ ఓటింగ్‌కు మొత్తం 269 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం మొత్తం 8 పోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు.