13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదు

28-03-2026 10:53 AM

గురుకులాల్లో ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ శిక్షణ

రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ భవనాలు

హైదరాబాద్: గురుకులాల్లో చదువుకుని అనేకమంది ఉన్నత స్థానాలకు వెళ్లారని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar Goud) తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... గురుకులాల్లో ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ కు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.

గురుకులాల్లో మౌలిక వసతులు పెంచుతున్నామని వివరించారు. విద్యార్థుల కోసం వంద సమీకృత హాస్టళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఆత్మగౌరవ భవనాల పేరుతో హాస్టళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. బీసీల అభివృద్ధి గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. బీసీల అభివృద్ధి గురించి విపక్ష నేతలు మంచి సలహాలు ఇవ్వాలని మంత్రి కోరారు. బలహీనవర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.