13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

చిత్తూరులో రోడ్డు ప్రమాదం... వరంగల్‌కు చెందిన కుటుంబం మృతి

28-03-2026 11:06 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో(Chittoor district) శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు, వారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల ముగ్గురిని వరంగల్ కు చెందిన శ్రీదర్ రావు, లక్ష్మి, ఆద్వికగా గుర్తించారు. వరంగల్ కు చెందిన శ్రీధర్ రావు కుంటుంబం బెంగళూరులో స్థిరపడింది. వేగంగా దూసుకొచ్చిన వీరి కారు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వస్తుండగా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.