1 April, 2026 | 12:20 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమాలపై సీఎస్ సమీక్ష

04-12-2024 06:10 PM

హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం సమీక్షించారు. ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ... డిసెంబర్ 7,8,9 తేదీల్లో ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. అదేవిదంగా ఈనెల 9న  డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ, భారీ డ్రోన్ షో ఉంటుందని తెలిపారు. ఈనెల 7న వందేమాతరం శ్రీనివాస్ బృందం సంగీత ప్రదర్శన ఉంటుందని, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న తమన్ మ్యూజికల్ ఈవెంట్లు ఉండనున్నట్లు సీఎస్ పేర్కొన్నారు.  అలాగే పీవీమార్గ్ లో 120 ఆహారం, హస్తకళల స్టాళ్లు ఉంటాయని శాంతి కుమారి తెలిపారు.