1 April, 2026 | 2:05 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

సీఎం తన భూములిస్తానంటే ప్రభుత్వ ధర కంటే ఎక్కువే ఇస్తాం

04-12-2024 05:38 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): పదవి కోసం ముఖ్యమంత్రిని ఉపముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారా..?, లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేశారు..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ ప్రాంతం వద్ద రేవంత్ కుటుంబానికి భూములు ఉన్నాయని ఆరోపించారు. వెల్దండలో రేవంత్ రెడ్డి కుటుంబానికి 600 ఎకరాల భూమి ఉంది. ఫోర్త్ సిటీ కోసం ఇస్తారా..? అని అడిగారు. రేవంత్ రెడ్డి తన బూములిస్తానంటే ప్రభుత్వ ధర కంటే ఎకరాకు తాము మరో రూ.5 లక్షలు ఎక్కువ ఇస్తామని కేటీఆర్ చెప్పారు. ఉన్న 14 వేల ఎకరాలు ఏం చేయాలో ముఖ్యమంత్రికి తెలియదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పరపతి లేదు, కేబినెట్ విస్తరణ ఆలస్యమే ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని, కేసులకు భయపడేది లేదు..పోరాడుతునే ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు.