7 July, 2026 | 2:57 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామా: కేటీఆర్

29-08-2024 12:13 PM

రుణమాఫీ లేదు.. రైతు భరోసా లేదు

హైదరాబాద్: రుణమాఫీ కాని రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ అనుమానిస్తోందని కేటీఆర్ అన్నారు. రైతుల సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త నాటకాలు మొదలు పెట్టిందని ఆరోపించారు. మొన్న ఖమ్మంలో ముసలవ్వ పింఛన్ వాసప్.. ఇప్పుడు రైతు రుణమాఫీతో వాపస్ ఆప్షన్ ఆ అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతును రాజు చేస్తే.. మీరు అనుమానిస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రుణమాఫీపై మంత్రులు, సీఎం జూటా మాటలు చేప్తున్నారని విమర్శించారు. ఒక రుణమాఫీ చేయడానికి వంద కొర్రీలు, సెల్ఫీ దిగి తాను రైతు అని అన్నదాత నిరూపించుకోవాలా?  అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయలేక రేవంత్ సర్కార్ కొత్త నాటకాలు చేస్తోందని మండిపడ్డారు. రుణమాఫీ లేదు.. రైతు భరోసా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రావడంతో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయన్నారు.