21 July, 2026 | 11:02 AM

తెలంగాణ స్పోర్ట్స్ మెడిసన్ సెంటర్‌గా సీఎస్‌ఎస్‌హెచ్

21-07-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 20 : తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల కోసం సెంటర్ ఫర్ స్పైన్, స్పోర్ట్స్ హె ల్త్ (సీఎస్‌ఎస్‌హెచ్)ను క్రీడా విజ్ఞాన, క్రీడా వైద్య కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. భారత బ్యాడ్మింటన్ జట్టు జాతీయ ప్రధాన కోచ్, సీఎస్‌ఎస్‌హె చ్ సహ -వ్యవస్థాపకుడు పుల్లెల గోపీచంద్, సెంటర్ ఫర్ స్పైన్, స్పోర్ట్స్ హెల్త్ సహ- వ్యవస్థాపకుడు, సీఈవో నరేష్ కుమార్ పాగిడి మర్రి ఈ గుర్తింపుపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  జయే ష్ రంజన్  సీఎస్‌ఎస్‌హెచ్‌ను సందర్శించి అక్కడ అం దుతున్న సేవలను పరిశీలించారు.