రన్నరప్‌గా రాజారిత్విక్
21-07-2026 12:00 AM
మెనూయిర్స్, జూలై 20 : తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ మరోసారి అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటాడు. ఫ్రాన్స్‌లోని మెనూయిర్స్ వేదికగా జరిగిన మెనూయిర్స్ ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలుచుకున్నాడు. నాలు గోసీడ్‌గా బరిలోకి దిగిన రాజా రిత్విక్ సంచలన ఆటతీరుతో 5 విజయాలు, 4 డ్రాలు సాధించి అగ్రస్థానం కోసం జీఎం రోహిత్ కృష్ణతో పోటీ పడ్డాడు. టై బ్రేక్‌లో వచ్చిన 43 పాయింట్లతో రోహిత్ కృష్ణ స్వర్ణం గెలుచుకోగా..41.5 పాయింట్లతో రాజా రిత్విక్ రజతం సాధించాడు.






