జీఎంఆర్ స్పోర్ట్స్ సికింద్రాబాద్ క్లబ్ 6వ యూత్ ఓపెన్ రెగట్టా ప్రారంభం
- హుస్సేన్ సాగర్ వేదికగా పోటీలు
- బరిలో దేశ, విదేశాలకు చెందిన సెయిలర్లు
హైదరాబాద్, జూలై 20 : జీఎంఆర్ స్పోరట్స్ 6వ వైఏఐ సికింద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలు హుస్సేన్ సాగర్‌లో ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస కైలాస ఈ పోటీలను ప్రారంభించారు. దేశ, విదేశాలకు చెెందిన 113 మంది సెయిలర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆరు రోజుల పాటు మొ త్తం ఏడు విభాగాల్లో ఈ జాతీయ ర్యాం కిం గ్ పోటీలు జరుగుతాయి.
ఈ పోటీల్లో ప్రదర్శనతో జాతీయ ర్యాంకింగ్స్‌లో తమ స్థానా లు మెరుగుపరుచుకోవడంతో పాటు రాబో యే టోర్నీలకు అర్హత సాధించేందుకు ఉపయోగపడనుంది. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ సహకారంతో, యాచింగ్ అసోసియేషన్ ఆ ఫ్ ఇండియా ఆమోదంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. బాలుర, బాలికల విభాగాల్లో ఆప్టిమిస్ ్ట మెయిన్ ఫ్లీట్ . గ్రీన్ ఫ్లీట్, ఐఎల్ సీఎ 4 , ఐఎల్ సీఎ 6, ఓపెన్, 420, 29ఈఆర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి.
జూ లై 23న ప్రత్యేకంగా ఆప్టిమిస్ట్ టీమ్ రేసింగ్ పోటీ ఉంటుంది. జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ప్రతీ ఏడాది సెయిలింగ్ పై చిన్నారుల్లో ఆసక్తి పెరగడం సంతోషంగా ఉందని సికింద్రాబాద్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అశ్విన్ సింగ్ చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో మరింత మంది సెయిలర్లను త యారు చేయడమే లక్ష్యమని సికింద్రాబాద్ క్లబ్ కమాడోర్ అర్జున్ ప్రదీపక్ చెప్పారు.






