21 July, 2026 | 8:07 PM

నిర్మల్ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ సేవలు

21-07-2026 04:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది కాలంగా సిటీ స్కానింగ్ సేవలు నిలిపివేయడంపై ఆమ్ ఆద్మీ   పార్టీ ఫిర్యాదు మేరకు ప్రభుత్వ స్పందించిందని జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ తెలిపారు. రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇటీవలే హైదరాబాదులో మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయడంతో వెంటనే సేవలు ప్రారంభించాలని కమిషన్ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ను సూచించినట్టు తెలిపారు. పేద ప్రజలకు ప్రభుత్వం వైద్యం అందించాలని ఉద్దేశంతో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వినోద్ శ్రీనివాస్ పాల్గొన్నారు.