21 July, 2026 | 8:41 PM

టీజీసీజీటీఏ యూనిట్ కార్యవర్గం ఎన్నిక

21-07-2026 05:16 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల కరీంనగర్ యూనిట్ బాడీ ఎన్నికలు మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ కృష్ణారెడ్డి, కట్టా వేణు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఆర్ రామకృష్ణ, కోశాధికారి, మహిళా కార్యవర్గ సభ్యురాలిగా  డాక్టర్ కే. కిరణ్మయి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా డాక్టర్ పడాల తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పి. రాజేష్  ప్రకటించారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు కళాశాల ఉన్నత విద్యాశాఖ  తెలంగాణ రాష్ట్ర ఐక్య కార్యాచరణ సమితి  అధ్యక్షులు డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. టిజిసి జిటిఏ ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ యూనిట్ బాడీ సభ్యులంతా హాజరై  ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించారు.