మాదాపూర్ శిల్పారామంలో సాంస్కృతిక వేడుకలు
20-07-2026 02:33 AM
శేరిలింగంపల్లి, జూలై 19 (విజయక్రాంతి): శిల్పారామం మాదాపూర్‌లో నిర్వహిస్తున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు మంచి స్పందన కలిగించాయి. ఆదివారం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి మేధా వ్యాకర్ణ తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె‘అమ్మ ఆనంద దయాని‘శ్రీ వల్లి దేవసేన స్తుతి’ఆనంద తాండవేశ్వరుని స్తుతి’అనే అంశాలను సుసంపన్నంగా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. మూషిక వాహన, పుష్పాంజలి, జతిస్వరం, కాలభైరవాష్టకం, భామాకలాపం, ఆనంద తాండవం, రాసలీల కృష్ణ, అన్నమాచార్య కీర్తనలు వంటి వివిధ అంశాలను సమర్థవంతంగా ఆవిష్కరించి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన పొందారు.






