28 June, 2026 | 2:08 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన

11-05-2025 12:28 AM

శేరిలింగంపల్లి, మే 10: మాదాపూర్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం బెంగళూరు నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారి ణి మేఖల అగ్నిహోత్రి భరతనాట్య నృత్య ప్రదర్శనలో పుష్పాంజలి, నవరస శ్లోకం దరువు వర్ణం, అంతఃపుర గీతం,ఆనంద నటన వంటి అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.

శ్రీదేవి ప్రశాంత్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో  మూషిక వాహన, బ్రహ్మాంజలి, అలరులు కురియగా, బ్రహ్మాంజలి, నారాయణతేయ్, నమఃశివాయ, దశావతార శబ్దం, పలుకే బంగారమయేహ్న, నీలమేఘ శరీర, అదివో అల్లదిగో, కొలువైతివరంగశాయి అంశాలను ఇరా, ఊర్మిళ, గీతికా, చార్వి, దియా, నైనికా, నిషిద్ధ, జాహ్నవి, అనూష, తనుశ్రీ, గోవర్ధిని  మొదలైన వారు ప్రదర్శించారు. అనంతరం కళాకారులందరికి జ్ఞాపికలను అందించి సత్కరించారు.