11-05-2025 12:29:34 AM
మణుగూరు,(విజయ క్రాంతి): మండల పరిధిలోని గుట్టమల్లారం రైతువేదిక నందు జిల్లా కలెక్టరు శ్రీ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు , 3 ఇంకుడు గుంతలు తవ్వించారు. మణుగూరు డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బి.తాతారావు మాట్లాడుతూ... ఈ ఇంకుడు గుంతలను తీయడం వల్ల వర్షపు నీరు వృథాగా పారకుండా భూమిలో ఇంకి భూగర్భ జలాలను పెంచి భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చేయవచ్చని, ప్రతి రైతులు తమ బోరు బావులు వద్ద అలాగే నీరు చేరుకొనే పల్లపు ప్రదేశం వద్ద ఇంకుడు గుంతలు తవ్వుకొని భూగర్భ జలాలను పెంచుకోవాలని కోరారు. మణుగూరు మండల వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణరావు మాట్లాడుతూ... ఫారం పాండ్ ( నీటి కుంటలు)ను ఉపాధి హామీ పథకం ద్వారా రాయితీపై తవ్వి పంటలను ఎండిపోకుండా కాపాడు కోవచ్చు అని ప్రతి రైతు తమ వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటలు (ఫారం పాండ్)లను ఖచ్చితంగా తవ్వించాలని కోరారు.