calender_icon.png 12 May, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపారస్తులను బెదిరిస్తున్న ముఠా అరెస్టు

11-05-2025 12:27:15 AM

-నిందితుల్లో జైలు వార్డెన్, కానిస్టేబుల్

శేరిలింగంపల్లి, మే 10: ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు,అవినీతి, అక్రమాలకు పాల్పడడం ఆశ్చర్యానికి గురిచేసింది.తాజాగా ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఒకరు జైలు వార్డెన్, మరొకరు కానిస్టేబుల్ విద్దరు మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి దోపిడీ పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు శనివారం వ్యాపారస్తులను బెదిరింపులకు పాల్పడుతున్న గ్యాం గ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు గయినీ శ్రీకాంత్ జైలు వార్డెన్ గా పనిచేస్తున్నాడు. ఏపీ కి చెందన పోలీస్ కానిస్టేబుల్ చింతకుంట శ్రీకాంత్, ఇమ్రాన్, వాసం శ్రీకాంత్‌లతో కలిసి కొన్నాళ్లుగా దోపిడీకి పాల్పడుతున్నారు.

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వ్యాపారస్తులను బెదిరిస్తూ భారీ వసూళ్లకు పాల్ప డుతున్నట్టు తెలిపారు. వ్యాపారస్తులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిపై నిఘా ఉంచి ఈ ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.