5 July, 2026 | 5:55 PM

Breaking News

జనాభాకు అనుగుణంగా అంగన్వాడీ పోస్టుకు రిజర్వేషన్ కేటాయించాలి   •   పోచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి   •   ఆగస్టు 2న ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చెయ్యండి   •   మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే పాయంని కలిసిన పినపాక మండల అధ్యక్షులు పేరం   •   బీసీలను కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి   •   రామేశ్వరం ఆర్టీసీ బస్సు   •   జూలై 10 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి   •   పులిమడుగు బ్రిడ్జి ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •   సీసీ కెమెరాలు ఏర్పాటులో సిద్దిపేట ఆదర్శం   •   ఇల్లందు అధికారుల రిలే దీక్షలకు లక్ష్మీపతి గౌడ్ సంఘీభావం   •  

రైతులకు అందుబాటులో జీలుగ విత్తనాలు

09-06-2025 10:08 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని రైతులకు జీలుగ విత్తనాలు సబ్సిడీపై అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి(Mandal Agriculture Officer G Kiranmayi) సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘ భవనాన్ని సోమవారం సందర్శించి మాట్లాడారు. వానాకాలం పంట సీజన్ కు గాను 50% సబ్సిడీలో పచ్చి రొట్టె పైరుకు సంబంధించి జీలుగ విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, 30 కిలోల బస్తా ధర 2137.50 రూ. ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపి, ఆధార్ జిరాక్స్ కాపి తో  వ్యవసాయ విస్తరణ అధికారిని  సంప్రదించాలని కోరారు. ఆమే వెంట మండల వ్యవసాయ విస్తరణ అధికారి సైండ్ల కనకరాజు పాల్గొన్నారు.