03-02-2026 12:17:05 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చి ప్రాంతంలోని చెత్త కుప్పలో ఓ సంచిలో ముక్కలు ముక్కలు చేసిన మృతదేహం సోమవారం లభ్యమైంది. చెత్త ఏరుకునే వారు సోమవారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా గోనె సంచిలో నుంచి కాళ్లు కనిపించాయి. వారు సీఎస్‌ఐ చర్చిలో ఉన్న వారికి చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు.
సీఐ నరహరి ఘటన స్థలానికి చేరుకొని గోనెసంచిలో ముక్కలు ముక్కలుగా ఉన్న వ్యక్తి భాగాలను గుర్తించారు. గోనెసంచిలో కాళ్లు, నడుము భాగం మాత్రమే లభించాయి. తల, మొండెం లభించలేదు. కాగా సుమారు మూడు రోజుల క్రితం హత్య చేసి, భాగాలుగా కోసి గోనె సంచుల్లో పెట్టి పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైంది ఎవరు, నిందితులు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.