10 June, 2026 | 4:52 PM

పాత నాణేలకు కోట్లలో డబ్బు ఆశ చూపి డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు

13-09-2025 10:34 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): సైబర్ మోసాల పట్ల  పోలీసులు ప్రజలకు  అవగాహన కల్పిస్తున్న  మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ గాయత్రీ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా నివసించే హరి ప్రసాద్ (36) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, తండ్రి లక్ష్మణ్ రావు టైలరింగ్ చేస్తాడు. వీరి వద్ద  పాత నాణేలు ఉన్నాయి. బంధువులు పాత నాణేలకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పడంతో తండ్రీ కొడుకులు నెట్ లో సెర్చ్ చేసి నాణేలకు డబ్బు ఇచ్చే ఒకరిని కాంటాక్ట్ అయ్యారు.

వీరి వద్ద ఉన్న నాణేలు వారికి ఫొటోస్ పంపగా, నాణేలకు రెండు కోట్ల, ముప్పై ఏడు లక్షల, ఇరవై ఐదు వేలు (2,37,25,000/– ) రూపాయలు వస్తాయని నమ్మించి, డబ్బులు ప్యాక్ చేసి పంపిస్తున్న వీడియోను చూపించి, శంషాబాద్ ఎయిర్ పోర్టు కి అమౌంట్ వచ్చాయని చెప్పి ఇట్టి డబ్బులకు  జి ఎస్ టి చెల్లించాలని, బాధితుడు నుండి 17,500/–రూపాయలు  ఆన్ లైన్ ద్వారా అమౌంట్ పంపించుకోని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించి మేడిపల్లి సైబర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నామని, సైబర్  మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.