పారిశుధ్యంపై పట్టింపేది...
ప్రత్యేకధికారుల పాలనలో పడకేసిన పారిశుధ్యం...
దుర్వాసన,ఈగలు,దోమలతో అవస్థలు పడుతున్న ప్రజలు...
గార్ల,(విజయక్రాంతి): గత నేల రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయి.గ్రామాల్లో పారిశుధ్య పనులపై పట్టించుకోని సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు. ప్రత్యేక అధికారులు ఎప్పుడు గ్రామాల్లో విధులకు హాజరవుతున్నారో అడిగే దిక్కే లేకుండా పోయింది. పంచాయతీ కార్యదర్శులకు సమస్యలు చెప్పుకున్నా అవి పరిస్కారం కాకపోవడంతో కార్యదర్శులకు చెప్పుకోవడం ప్రయోజనం లేదని ప్రజలు వాపోతున్నారు.
మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల వ్యాప్తంగా 20 గ్రామపంచాయతీ లలో మురికి కాలువల వ్యర్థాలను తీసి రోడ్లపై వేయడంతో దుర్వాసన,దోమలు ఈగల ప్రభావం వలన డెంగ్యూ,టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నప్పటికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులు,సిబ్బందిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా, మండల ఉన్నతధికారుల పర్యవేక్షణ లేమీతో చుట్టపు చూపుగా పంచాయతీ కార్యాలయాలలో సంబంధిత అధికారులు వీధులు నిర్వర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేపట్టి, విధి లైట్లు ఏర్పాటు చేయాలనీ, దోమల మందులు పిచికారీ చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.






