హెచ్-సిటీ పనుల్లో వేగం పెంచండి
- నిర్ణీత గడువులోగాప్రాజెక్టులు పూర్తి కావాలి
- సీఎంసీ కమిషనర్ సృజన
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడమే లక్ష్యంగా, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్-సిటీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయా లని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో వివిధ జోన్లలో జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పనుల అమలులో అధికారులంతా జవాబుదారీతనంతో, పకడ్బందీ సమన్వయంతో వ్యవహరించి మౌలిక సదుపాయాల అభివద్ధినలో వేగం పెంచాలని కమిషనర్ స్పష్టం చేశారు.
హెచ్-సిటీ కింద చేపట్టిన భారీ ప్రాజెక్టుల తాజా పరిస్థితిని వారు కమిషనర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఫాక్స్ సాగర్ ఫ్లుఓవర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను తక్షణమే వేగవంతం చేయాలని ఆమె ఆదేశిం రు. అలాగే, ఐటీ కారిడార్లో అత్యం త రద్దీగా ఉండే ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్, ఆల్విన్ ఎక్స్ రోడ్స్ వద్ద చేపట్టిన మల్టీ-లెవల్ గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.శేరిలింగంపల్లి,
అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను ఫాస్ట్-ట్రాక్ మోడ్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులకు సంబంధించిన భూసేక రణ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల అమలుపై ఇక నుంచి ప్రతి వారం ప్రగతి నివేదికలు అందజేయాలని కమిషనర్ ఆదేశించారు.సమీక్షా సమా వేశంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్, సిటీ ప్లానర్ ,భూసేకరణ అధికారి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




