10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు
స్టెమ్‌స్పార్క్‌లో రెజొనెన్స్ పాఠశాలలో వేడుక
ఖమ్మం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ 10 వ తరగతి విద్యార్ధుల వీడ్కోలు వేడుక పిల్లల నత్యాలు, ఆటపాటలు, కేరింతలతో గురువుల ఆశీస్సుల నడు మ అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా చిన్నపిల్లల వైద్యనిపుణులు డా.కూరపాటి ప్రదీప్‌కుమార్, స్టెమ్‌స్పార్‌క రెజొనెన్స్ స్కూల్ డైరెక్టర్స్ కొండా శ్రీధర్‌రావు, కొండా కృష్ణవేణి పాల్గొన్నారు.
డా.కూ రపాటి ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఉన్నతిలో తల్లిదండులు, గురువుల పాత చాలా గొప్పదని తెలియజేస్తూ వారిని నిత్యం గౌరవించాలని, చదువుతోపాటు ఆట ల మీద కూడా శ్రద్ధ పెట్టాలని ఆకాంక్షించారు. స్కూల్ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. పుస్తకపఠనాన్ని అలవాటు చేసుకుని జ్ఞానాన్ని పొందాలని తెలియజేశారు. 10వ తరగతి విద్యార్థులను చక్కటి ప్రణాళికలతో పబ్లిక్ పరీక్షలకు సిద్దం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. కొండా కృష్ణవేణి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్ధి పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే తనలోని చెడు అలవాట్లకు వీడ్కోలు చెప్పాలన్నారకు.




