సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఏఎస్ఐ కుమారస్వామి
మహా ముత్తారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని యామన్ పల్లి గ్రామంలో అడవి ముత్తారం ఎ ఎస్ఐ కుమారస్వామి ప్రజలకు సైబరు నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా విస్తరిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను మెసేజ్లు, అనుమానస్పదమైన లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. బ్యాంకు ఖాతా వివరాలను ఓటీపీ ఏటీఎం పిన్ సంఖ్యలను ఎవరితోనూ పంచుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






