calender_icon.png 2 November, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోంథా తుపానుపై అప్రమత్తం

28-10-2025 12:54:10 AM

-కాకినాడకు 680 కి.మీదూరంలో తుపాను కేంద్రీకృతం

-తక్షణ చర్యలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

-ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోదీ కాల్

అమరావతి, అక్టోబర్ 27: మోంథాతు పాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రం నుంచి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి తుపాను పరిస్థితిపై ఆరా తీశారు.  పస్తుతం మొంథా తుపాను కాకినాడకు 680 కిలోమీటర్ల దూ రంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు సీఎంకు వివరించారు.

గంటకు 16 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతోందని, ఆదివారం రాత్రికి తీరాన్ని తాకే అవకాశం ఉంద ని వాతావరణశాఖ పేర్కొంది. తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కృష్ణా జిల్లాలో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే గుం టూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీవర్షాలు పడతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంట నష్టం జరగకుండా కాలువ గట్లను పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌కు సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు లోకేశ్, అనిత, ప్రధానకార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

4౩ రైళ్లు రద్దు

తుపాను నేపథ్యంలో 43 ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. అక్టోబర్ 27, 28, 29వ తేదీల్లో ఈ రద్దు అమలులో ఉంటుంది. ప్ర యాణికులు తమ ప్రయాణ వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్, యాప్‌ను పరిశీలించాలని లేదా హెల్ప్‌లైన్ నంబర్ 139ను సంప్రదించాలని అధికారులు సూ చించారు. రద్దయిన రైళ్ల పూర్తిజాబితాను ‘ఎక్స్’లో పోస్ట్ చేసినట్లు వెల్లడించారు.