3 April, 2026 | 2:54 AM

మేడ్చల్ మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులుగా డి.ప్రభాకర్

03-04-2026 01:29 AM

మేడ్చల్ అర్బన్ ఎప్రిల్ 2 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసిసి కార్యవర్గ సభ్యులుగా గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దామన్నగారి ప్రభాకర్ నియామాకమయ్యారు. గురువారం తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ ఎమ్మెల్సీ ధామన్నగారి ప్రభాకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన ప్రభాకర్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులుగా నియామకం చేసిన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.తోటకూర వజ్రేష్ యాదవ్ లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి.సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు.