21 July, 2026 | 1:02 AM

మాజీ మంత్రి డీఎస్ అంతిమయాత్ర ప్రారంభం

30-06-2024 02:42 PM

హైదరాబాద్: మాజీ మంత్రి పిసిసి అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డి.శ్రీనివాస్‌ అంతిమ యాత్ర ప్రారంభ మైంది. కడసారి చూపుకోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. ప్రగతినగర్‌ లోని నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభించారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డు సమీపంలోని ఫామ్ హౌజ్ లో డీఎం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డి. శ్రీనివాస్ అంతిమయాత్రలో కుటుంబసభ్యులు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిజామాబాద్‌లోని ప్రగతి నగర్‌లో డి.శ్రీనివాస్‌కు నివాళులర్పించారు. డీఎస్ కుంటుంబానికి అండగా ఉంటాం.. సోనియా, రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.