డీఈవోలకు పీజీఐపై శిక్షణ
21-07-2026 12:57 AM
ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో కార్యక్రమ నిర్వహణ
హైదరాబాద్ జూలై 20 (విజయక్రాంతి): జిల్లా విద్యాధికారులకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర స్థాయిలో పర్ఫార్మెన్స్ గ్రేడిం గ్ ఇండెక్స్ (పీజీఐ)పై తలపెట్టిన శిక్షణా కార్యక్రమం తొలిరోజు ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ప్రారంభమైంది.
జిల్లా డీఈవోలు, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్స్, క్వాలిటీ కోఆర్డినేటర్స్, ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం, క్లస్టర్స్ రిసోర్స్‌పర్సన్‌లు ఈ శిక్షణకు హాజరయ్యారు. పీజీఐ ర్యాంకింగ్‌లో 28 స్థానం నుంచి తెలంగాణ 18స్థానానికి చేరడంతో అధికారులను విద్యాశాఖ కార్యదర్శి యోగి తా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందించారు. వీరికి నేడు కూడా శిక్షణ కొనసాగనున్నది.






