2023 బ్యాచ్ లెక్చరర్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి
21-07-2026 12:52 AM
టీజీఎల్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం
హైదరాబాద్ జూలై 20 (విజయక్రాంతి): 2023 బ్యాచ్ లెక్చరర్లకు ఇంక్రిమెంట్ ఇవ్వాల్సిందేనని, ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడంతో న్యాయం గెలిచిందని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంశంలో వివిధ సంఘాలు వేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసినట్లు ఆయన పేర్కొన్నారు. తమ సంఘం తరుపున ఆధారాలతో వాదించి 2023 బ్యాచ్ అధ్యాపకులకు ఇంక్రిమెంట్ అందేలా కృషి చేశామని, కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయాలని కోరారు.






