21 July, 2026 | 11:36 AM

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో నేడు జగన్నాథ స్వామి రథోత్సవం

21-07-2026 12:51 AM

ఎల్బీనగర్, జూలై 20 : ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో మంగళవారం రథోత్సవం నిర్వహిస్తున్నారు.  జగన్నాథ స్వామి రథోత్సవాన్ని త్రిందండి శ్రీ భక్తి సౌరభ్ మజారాజ్  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మంగళవారం ఉదయం 11 గంటలకు జగన్నాథ స్వామి రథోత్సవంలో భాగంగా రథ యాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం ప్రత్యేక పూజలు, హారతి, మహా ప్రసాద వితరణ చేయనున్నారు. జగన్నాథ స్వామి రథోత్సవంలో భక్తులందరూ పాల్గొనాలని ఆలయ ఈవో లావణ్య, అధికారులు కోరారు.